Kadapa Hotel Incident | శృంగారంలో అపశృతి.. విలేకరి నాలుక కొరికిన మహిళ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kadapa Hotel Incident | ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. శృంగారంలో పాల్గొన్న మహిళ విటుడి నాలుక కొరికి వేయడమే ఇందుకు కారణం.

కర్బూజ వ్యాపారం చేసే ఓ పత్రికా విలేకరి రవిబాబు, ఆటో డ్రైవర్ హరికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఇటీవల వీరు ముగ్గురు కలిసి ఒంటిమిట్టలోని హరిత హోటల్‌కు వెళ్లారు. అక్కడ సిబ్బంది అడ్డుకున్నా.. విలేకరి తన పరపతిని ఉపయోగించి లోపలికి దూరారు.

Kadapa Hotel Incident | తీవ్ర రక్తస్రావం

గదిలోకి వెళ్ళిన తర్వాత ముగ్గురూ కలిసి మద్యం తాగారు. ఆపై జరిగిన శృంగారంలో సదరు మహిళ విలేకరి రవిబాబు నాలుకను బలంగా కొరికివేసింది. దీంతో బెడ్​తోపాటు ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైంది.

తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడ్డ రవిబాబు వెంటనే స్థానిక PHCకి పరిగెత్తాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుడిని వైద్యులు 108లో కడప రిమ్స్‌ (RIMS)కు తరలించారు. ఈ లోపు సదరు మహిళను ఆటో డ్రైవర్ రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టి పారిపోయాడు.

Kadapa Hotel Incident | మెమో జారీ

ప్రస్తుతం ఆ మహిళ పరారీలో ఉంది. కాగా, అఘాయిత్యం నుంచి తప్పించుకోవడానికి ఆమె కొరికిందా..? లేక మరేదైనా కారణమా..? అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హరిత హోటల్ మేనేజర్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు.

Hantavirus WHO Alert | కొవిడ్​ను మించిన వైరస్.. ప్రపంచ దేశాలను అలర్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *