Ramareddy Accident | పైప్​లైన్​ గుంతలో పడిన కారు.. దంపతులకు గాయాలు

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి : Ramareddy Accident | అండర్​ గ్రౌండ్​ పైప్​లైన్​ గుంతలో కారు పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలు గాయపడ్డారు. రామారెడ్డి మండలం (Ramareddy Mandal) రంగంపేట శివారులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

కామారెడ్డి (Kamareddy)కి చెందిన మొగుళ్ల వనిత-రమేష్ గౌడ్ దంపతులు కారులో రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలోని బంధువుల ఇంటికి బయలుదేరారు. అయితే రంగంపేట శివారులో రైల్వే గేటు వద్ద అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కోసం భారీ గుంతలు తవ్వారు. పక్కనే వేసి ఉన్న పైపులను ఢీకొని కారు ఒక్కసారిగా పైప్ లైన్ కోసం తవ్విన గుంతలో పడిపోయింది. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో వారు గాయాలతో బయట పడ్డారు.

Ramareddy Accident | జేసీబీ సాయంతో బయటకు..

కారులో చిక్కుకున్న భార్యాభర్తల కేకలు విన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో భార్యాభర్తలను గుంతలో నుంచి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే కామారెడ్డి జీజీహెచ్​కు తరలించారు. పైప్​లైన్​ గుంతల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని, అందువల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Bakrid Peace Meeting | బక్రీద్​ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి..: సీపీ సాయిచైతన్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *