Harish Rao | రైతులతో కాళ్లు మొక్కిస్తున్న ప్రభుత్వం : హరీశ్​రావు

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | దేశానికి అన్నం పెట్టే రైతుతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే రైతన్నకు దిక్కెవరు అని ప్రశ్నించారు.

Harish Rao | ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు. కాంటాలు కాక, లారీలు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం నెల రోజులు గడుస్తున్నా.. కాంటా కావడం లేదు. దీంతో కేంద్రాలకు వచ్చే అధికారులకు రైతులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు (Farmers) ఓ అధికారిణి కాళ్లపై ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకున్నారు. ఈ వీడియోను ఎక్స్​లో పోస్ట్ చేసిన హరీశ్​రావు కాంగ్రెస్​ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Harish Rao | ప్రభుత్వం ఏం చేస్తోంది

ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను ప్రభుత్వమే కొనకపోతే ఆ రైతన్నకు దిక్కెవరని ప్రశ్నించారు. కల్లాల్లో రోజుల తరబడి పంటకు కాపలా కాస్తూ, దిగులుతో అన్నదాతలు
పిట్టల్లా రాలిపోతుంటే కళ్లప్పగించి చూడటం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులే ముప్పుతిప్పలు పెట్టి మరణశాసనం రాస్తుంటే,
దిక్కుతోచని అన్నదాత ‘నీ బాంచన్ పంట కొనండి’ అని కాళ్లపై పడటం తప్ప ఇంకేం చేయగలడన్నారు. రైతన్న కన్నీటి శాపం పాలకులను వదలదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Chicken Price Hike | మాంసం ప్రియులకు షాక్​.. భారీగా పెరిగిన చికెన్​ ధరలు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *