Hyderabad Drone Restrictions | 10న ప్రధాని Modi హైదరాబాద్‌ పర్యటన.. పోలీసుల కీలక ఆదేశాలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hyderabad Drone Restrictions | ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌ ​నగరంలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఈ నెల 10వ తేదీన బేగంపేట పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రజాసభ నేపథ్యంలో పారా గ్లైడర్లు, డ్రోన్లు, రిమోట్‌ కంట్రోల్‌ మైక్రో లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎగుర వేతలపై  నిషేధం విధించారు.

Hyderabad Drone Restrictions | భద్రతా పరిరక్షణ దృష్ట్యా

బోయిన్‌పల్లి, బేగంపేట, మారేడ్‌పల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మే 10వ తేదీన ఉదయం 00:00 గంటల నుంచి రాత్రి 24:00 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల భద్రత, భద్రతా పరిరక్షణ దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించాలని, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉల్లంఘనలు చోటుచేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.

Vijay Oath Confusion | విజయ్‌ ప్రమాణ స్వీకారంపై మళ్లీ సందిగ్ధత.. కారణం ఏమిటంటే..!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *