అక్షరటుడు వెబ్‌డెస్క్:Saudi Job Scam|ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్న తెలంగాణ కార్మికుల జాబితాలో మరో యువకుడు చేరాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బిబి రాజ్ పల్లి గ్రామానికి చెందిన దాసరి అరవింద్ (23) అనే యువకుడు సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుకొని, ప్రాణభయంతో విలపిస్తున్నాడు. “నన్ను ఎలాగైనా కాపాడండి.. ఇక్కడ ఉండలేకపోతున్నాను” అంటూ అతను పంపిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి కన్నీళ్లు పెట్టిస్తోంది.
Saudi Job Scam|ప్యాకింగ్ వర్కర్ ఉద్యోగం అని నమ్మించి..
కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవాలనే ఉద్దేశంతో అరవింద్ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఒక ఏజెంట్ అరవింద్‌ను సంప్రదించి, సౌదీలో ప్యాకింగ్ వర్కర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకోసం అరవింద్ నుంచి రూ. 90 వేలు వసూలు చేశాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఏజెంట్ అసలు స్వరూపం బయటపడింది. రియాద్ నగరానికి సుమారు 950 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ఎడారి ప్రాంతానికి అరవింద్‌ను గొర్రెల కాపరిగా పంపించి ఏజెంట్ చేతులెత్తేశాడు.
Saudi Job Scam|యజమాని వేధింపులు..
ఎడారి ప్రాంతంలో ఎండవేడిమికి తోడు, కనీసం తాగడానికి నీరు, తినడానికి సరైన ఆహారం లేక అరవింద్ తీవ్ర అవస్థలు పడుతున్నాడు. దీనికి తోడు అక్కడ యజమాని తనను నిరంతరం వేధిస్తున్నాడని, కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడని అరవింద్ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్త ప్రదేశంలో, భాష తెలియక, ఎవరిని సంప్రదించాలో తెలియని స్థితిలో ఉన్న తనను రక్షించి స్వదేశానికి రప్పించాలని అతను తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలను వేడుకుంటున్నాడు. ఈ వీడియో చూసిన అరవింద్ కుటుంబ సభ్యులు ఆందోళనలో మునిగిపోయారు.
సౌదీ ఎడారిలో చిక్కుకున్న జగిత్యాల జిల్లా యువకుడు
నన్ను కాపాడండి అంటూ సెల్ఫీ వీడియో
ఉపాధి కోసం సౌదీ వెళ్లిన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బిబి రాజ్ పల్లికి చెందిన దాసరి అరవింద్ (23)
ప్యాకింగ్ వర్కర్ ఉద్యోగమని నమ్మించి రూ. 90 వేలు వసూలు చేసిన ఏజెంట్
రియాద్‌కు 950 కి.మీ.… pic.twitter.com/nf7Jj0Amdd
— BIG TV Breaking News (@bigtvtelugu) May 9, 2026
ఇది కూడా చదవండి: Suvendu Adhikari | బెంగాల్ ప్రమాణ స్వీకార వేదికపై అపూర్వ దృశ్యం.. వృద్ధ నేత పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

