అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: Congress SC Cell | కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా కార్యవర్గం రద్దయిందని నగర కార్పొరేషన్ (Nizamabad Congress) డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
Congress SC Cell | రాష్ట్ర అధ్యక్షుడు సూచన మేరకు..
రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే జిల్లా అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందన్నారు. ఇందుకుగాను జిల్లాల వారీగా పరిశీలకులను నియమించారని ఆయన తెలిపారు. నిజామాబాద్(Nizamabad) జిల్లాకు పరిశీలకుడిగా చుక్క శ్రీనివాస్‌ను నియమించారని వివరించారు. ఆశావహులైన దళిత నాయకులు(Dalit Leaders) తమ బయోడేటాను కాంగ్రెస్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. త్వరలో జిల్లా కమిటీలను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఇది కూడా చదవండి: Bandhi Sanjay Case | ప్రధాని మోడీ ప్రోగ్రాం నుంచి బండి పేరు తొలగింపు.. మెడకు చుట్టుకున్న కొడుకు కీచక వ్యవహారం!

