తెలంగాణModi Hyderabad Visit | హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

Modi Hyderabad Visit | హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్​ పోర్ట్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Hyderabad Visit | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హైదరాబాద్ చేరుకున్నారు. బెంగళూరు పర్యటన ముగించుకొని ఆయన ప్రత్యేక విమానంలో నగరానికి వచ్చారు. బేగంపేట ఎయిర్​ పోర్ట్​లో ప్రధానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఘన స్వాగతం పలికారు.

ప్రధాని బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో హెచ్​ఐసీసీకి బయలు దేరారు. షెడ్యూల్ కంటే అరగంట ఆలస్యంగా ప్రధాని రాష్ట్రానికి వచ్చారు. మోదీ రూ.9,377 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. వర్చువల్​గా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి ప్రధాని మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి సైతం పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్​లోని పరేడ్ గ్రౌండ్​లో బహిరంగ సభలో మోదీ మాట్లాడుతారు.

Modi Hyderabad Visit | టెక్స్​టైల్​ పార్క్​ ప్రారంభం

వరంగల్‌లో పీఎం మిత్రా పార్క్ (కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్)ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎక్స్​ వేదికగా మంత్రి శ్రీధర్​బాబు ప్రధానికి స్వాగతం పలికారు. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిస్థాయి పీఎం మిత్రా పార్క్ ఇక్కడకు చేరుకుందన్నారు. ఒకప్పుడు వరంగల్ నేత కార్మికులు తమ సొంత ఊళ్లకు దూరంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, నేడు వరంగల్ వారిని పిలుస్తొందన్నారు.

హైటెక్స్​లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్​రెడ్డి, గవర్నర్​ శివప్రతాప్​ శుక్లా, కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్​, ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Inter Admissions | య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు.. సీఎం కీలక ఆదేశాలు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Polytechnic Entrance Test | పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Polytechnic Entrance Test | పాలిటెక్నిక్​ కామన్​...

Telangana Promo Run | ఆరోగ్యకరమైన జీవనశైలికి ‘పరుగు’ ఎంతో ఉపయోగకరం

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Telangana Promo Run | ఆరోగ్యకరమైన జీవనశైలికి...

Revanth Reddy | తెలంగాణపై పెద్ద మనసు చూపండి.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విన్నపం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Revanth Reddy | తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా...

PM Modi Visit | దేశాభివృద్ధిలో హైదరాబాద్​ పాత్ర కీలకం : ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi Visit | దేశాభివృద్ధిలో హైదరాబాద్...