Telangana Women Commission | తెలంగాణ మహిళా కమిషన్‌ ఏర్పాటు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Women Commission | రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ మహిళా కమిషన్​ను నియమించింది. కమిషన్​ ఛైర్​పర్సన్​గా గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi)ని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.

ఛైర్​పర్సన్​తో సహా ఏడుగురు సభ్యులతో కమిషన్​ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సభ్యులు​ ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. కమిషన్​ సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ్ రెడ్డి, సదా లక్ష్మి, రాధాబాయి, షకీరా నియమితులయ్యారు.

Telangana Women Commission | సభ్యుల నేపథ్యం..

సీనియర్​ నాయకుడు కే కేశవరావు కుమార్తె, హైదరాబాద్ మాజీ మేయర్​ గద్వాల విజయలక్ష్మిని ప్రభుత్వం మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​గా నియమించడం గమనార్హం. ఆమె బీఆర్​ఎస్​ హయాంలో మేయర్​గా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు ప్రభుత్వం సభ్యురాలిగా అవకాశం కల్పించింది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేతకు సైతం అవకాశం ఇచ్చింది. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం అవకాశం కల్పించడం గమనార్హం. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని సభ్యులను నియమించింది.

దీనిని కూడా చదవండి : Rashmi Gautam | బండి సంజయ్​ కుమారుడిపై పోక్సో కేసు.. రష్మీ సంచలన పోస్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *