అక్షరటుడే, కామారెడ్డి: Car Accident Kamareddy | అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటన భిక్కనూరు(bhikknoor) మండలం జంగంపల్లి శివారులో జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
Car Accident Kamareddy | నిర్మల్ నుంచి హైదరాబాద్కు..
పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ (Nirmal) నుంచి హైదరాబాద్కు(Hyderabad) ఓ కారులో భార్యాభర్తలు పిల్లలతో వెళ్తున్నారు. భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో జాతీయ రహదారిపై ఒక్కసారిగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. జాతీయ రహదారిపై కారు బోల్తా పడటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారును పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ఇది కూడా చదవండి:Telangana Women Commission | తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు

