Revanth Reddy Anti Drug Pledge | జూన్​ 12న విద్యార్థుల మహాసభ.. యాంటీ డ్రగ్‌ ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్​కు సీఎం ఆహ్వానం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Revanth Reddy Anti Drug Pledge | రాజ్​భవన్‌లో సోమవారం Shiv Pratap Shuklaను A. Revanth Reddy మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూన్‌ 12న పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న విద్యార్థుల మహాసభకు హాజరుకావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు.

Revanth Reddy Anti Drug Pledge | అవగాహన కార్యక్రమం

వచ్పే నెల 12వ తేదీన విద్యార్థుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం చేపడుతోంది. విద్యార్థులు మద్యం, పొగాకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సంకల్పం చేయించేలా సామూహిక ప్రతిజ్ఞ నిర్వహించనున్నారు.

ఇటీవల గవర్నర్ శివప్రతాప్‌ శుక్లా, విద్యార్థులతో యాంటీ డ్రగ్‌ ప్రతిజ్ఞ చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు. ఆయన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విద్యార్థుల సమీకరణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది.

Bandi Bhagirath Case | పరారీలో బండి సంజయ్​ కుమారుడు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *