నిజామాబాద్Kamareddy Vegetable Vendors | పట్టణంలో రాత్రివేళ రోడ్డు పక్కనే కూరగాయల విక్రయాలు..

Kamareddy Vegetable Vendors | పట్టణంలో రాత్రివేళ రోడ్డు పక్కనే కూరగాయల విక్రయాలు..

కామారెడ్డి పట్టణంలో రోజువారీగా కూరగాయల విక్రయాలు జరుగుతుంటాయి. అయితే వసతుల లేమి కారణంగా విక్రయదారులు రోడ్డుపైనే కూరగాయలు అమ్ముతున్నారు. దీంతో అటు కొనుగోలుదార్లకు, విక్రయదారులకు ప్రమాదం పొంచి ఉంది.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Vegetable Vendors | పట్టణంలో రోజువారీగా కూరగాయల (vegetable vendors) విక్రయాలు జరుగుతుంటాయి. అయితే వసతుల లేమి కారణంగా విక్రయదారులు రోడ్డుపైనే కూరగాయలు అమ్ముతున్నారు. దీంతో అటు కొనుగోలుదార్లకు, విక్రయదారులకు ప్రమాదం పొంచి ఉంది.

Kamareddy Vegetable Vendors | ఏళ్ల తరబడి రైతుబజార్​ కోసం..

పట్టణంలో (Kamareddy City) కూరగాయల విక్రయదారులు ఏళ్ల తరబడిగా సరైన విక్రయస్థలం కోసం ఎదురుచూస్తున్నారు. రూ.50 లక్షలు వెచ్చించి నిర్మించిన రైతుబజార్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రూ.7 కోట్లతో మొదలు పెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ (Integrated Market) సముదాయం పిల్లర్ల స్థాయిలోనే ఆగిపోయింది. దీనిని పూర్తిస్థాయిలో నిర్మించి రైతులకు అందుబాటులోకి తేవాలన్న ఆలోచన అధికారులకు, ప్రజాప్రతినిధులకు లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. కామారెడ్డి పట్టణంలో వివిధ గ్రామాల నుంచి వచ్చే కూరగాయల రైతులు సరైన స్థలం లేక రోడ్లపై కూరగాయలు విక్రయిస్తున్నారు.

Kamareddy Vegetable Vendors | సీఎస్​ఐ మైదానం ఎదురుగా..

వారం సంత మినహా ప్రతిరోజు ప్రమాదకరంగా రోడ్లపైనే కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలోని సీఎస్ఐ మైదానం(CSI Ground) ఎదురుగా పాత జాతీయ రహదారి పక్కనే కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో సీఎస్ఐ గ్రౌండ్​లో విక్రయాలు జరిగేవి. గ్రౌండులో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తుండటంతో రైతులకు ఇబ్బందిగా మారుతోంది.

ప్రధాన రహదారికి ఆనుకుని విక్రయాలు చేపడుతుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదైనా వాహనం అదుపుతప్పితే నేరుగా కొనుగోలు, విక్రయదారులపైకి వెళ్లే అవకాశాలున్నాయి. అదే జరిగితే ప్రాణనష్టం పొంచి ఉంది. ఈ విషయాన్ని అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. ప్రతిరోజు ఈ దారిన తిరిగే అధికారులు నిత్యం చూస్తున్నా రైతులకు ఏదైనా స్థలం కేటాయించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి రైతులకు ఏదైనా ప్రమాదం జరగకముందే సరైన స్థలాన్ని కేటాయించాలని రైతులు కోరుతున్నారు. అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Komiravelli Panchayat Bribery | డ్రైనేజీ పైపులైన్​ తొలగించేందుకు లంచం.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శితోపాటు సర్పంచి భర్త!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Komiravelli Panchayat Bribery | రాష్ట్రంలో అవినీతి అధికారులు...

SP Rajesh Chandra | చోరీలకు పాల్పడుతున్న వ్యక్తుల ఆట కట్టించిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పట్టణంలో పలు చోరీలకు...

Modi Online Classes | విద్యాసంస్థలు కొన్నాళ్లు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించాలి : ప్రధాని Modi పిలుపు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Modi Online Classes | అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత...