తెలంగాణRevanth Reddy | గవర్నర్​ను కలిసిన సీఎం రేవంత్​రెడ్డి

Revanth Reddy | గవర్నర్​ను కలిసిన సీఎం రేవంత్​రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆదివారం గవర్నర్​ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. గవర్నర్ కోటాలో పెండింగ్ ఉన్న ఎమ్మెల్సీ ఫైల్‌పై చర్చించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆదివారం గవర్నర్​ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla)ను కలిశారు. లోక్‌భవన్‌లో గవర్నర్ ఆయనతో భేటీ అయ్యారు.

గవర్నర్ కోటాలో పెండింగ్ ఉన్న ఎమ్మెల్సీ ఫైల్‌పై సీఎం చర్చించారు. అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు ఆరు నెలలు కావొస్తుంది. ఈ నెల 30తో ఆరు నెలలు పూర్తి అవుతుంది. మంత్రి అయినా తరువాత 6 నెలల లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక తప్పనిసరి అనే నిబంధన ఉంది.

Revanth Reddy | రంగంలోకి దిగిన సీఎం

అజారుద్దీన్​ ఎమ్మెల్సీగా నియామకం కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే కాంగ్రెస్​ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మైనారిటీల ఓట్ల కోసం ఆగమేఘాల మీద అజారుద్దీన్​కు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆ పదవి పోతే.. మైనారిటీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. త్వరలో జీహెచ్​ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నగరంలో ముస్లింల ఓట్లు అనేక ప్రాంతాల్లో కీలకం.

governor

ఈ క్రమంలో అజారుద్దీన్​ (Azharuddin) మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తే ఓట్ల కోసం నాలుగు రోజులు పదవి ఇచ్చారనే అపవాదు వచ్చే అవకాశం ఉంది.ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి స్వయంగా గవర్నర్​తో భేటీ అయ్యారు. పెండింగ్​లో ఉన్న ఎమ్మెల్సీల పదవి గురించి చర్చించారు. అజారుద్దీన్​తో పాటు ప్రొఫెసర్​ కోదండరాం ఎమ్మెల్సీ పదవి సైతం పెండింగ్​లో ఉంది. గతంలో కోదండరాంతోపాటు అమీర్​ అలీఖాన్​ను కాంగ్రెస్​ గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించింది. అయితే వీరి నియామకాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అనంతరం మరోసారి కోదండరాం పేరును సిఫార్స్​ చేసిన ప్రభుత్వం అమీర్​ అలీఖాన్​ స్థానంలో అజారుద్దీన్​ పేరును ప్రతిపాదించింది. మారి వీరి నియామకంపై గవర్నర్​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మాదకద్రవ్య రహితంగా విద్యా ప్రాంగణాలను మార్చాలనే అంశంపై సైతం వారు చర్చించారు. మాదకద్రవ్యాలతో కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని గవర్నర్​ సూచించారు. విద్యా సంస్థలలో మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులచే మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్ ప్రతిపాదించారు. జూన్ 12న LB స్టేడియంలో తన ఆధ్వర్యంలో జరగనున్న అవగాహన కార్యక్రమం గురించి ఆయన చర్చించారు.

ఇది కూడా చదవండి..: Student Addiction | దారి తప్పుతున్న యువత.. వ్యసనాలకు బానిసలుగా విద్యార్థులు

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....