Illegal Sand Transport | అక్రమ ఇసుక రవాణాపై చీతా ఫోర్స్​ ఉక్కుపాదం.. రెండు భారీ లారీలు సీజ్

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Illegal Sand Transport | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో(Nizamabad Police) ఇసుక అక్రమ (Sand Mafia) రవాణాపై చీతా ఫోర్స్(Cheeta Force) ఉక్కుపాదం మోపుతోంది. వరుసగా దాడులు చేస్తూ ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తోంది. సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ చురుకుగా స్పందిస్తూ జిల్లావ్యాప్తంగా దాడులు చేస్తోంది.

Illegal Sand Transport | ఆర్మూర్, మోర్తాడ్ ప్రాంతాల్లో..

ఆర్మూర్, మోర్తాడ్ ప్రాంతాల్లో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న(Sand Smuggling) ప్రాంతాలపై సీసీఎస్ ఏసీపీ ఇన్​ఛార్జి మస్తాన్​అలీ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, రవాణా పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు భారీ లారీలను చీతా ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. వాటిని వెంటనే స్వాధీనం చేసుకొని డ్రైవర్లు, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మోర్తాడ్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చీతా ఫోర్స్​ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు (Police Raids) నిర్వహించారు. పట్టుబడ్డ లారీలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత పోలీస్​స్టేషన్లకు అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Illegal Sand Transport | ప్రభుత్వ ఆదాయానికి నష్టం

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లుతుందని చీతా ఫోర్స్​ ప్రతినిధి ఒకరు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాలు దెబ్బతిని పర్యావరణ సమతుల్యతకు (Environmental Protection) సైతం ముప్పు వాటిల్లుతుందని వారన్నారు. ఇసుకను అక్రమంగా తవ్వడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరమన్నారు.

ఇది కూడా చదవండి: Google Server Error| షాకిచ్చిన గూగుల్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ‘సెర్చ్’ సేవలు

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *