క్రైంIndalwai Checkpost Inspection | ఇందల్వాయి చెక్​పోస్ట్​ వద్ద సీపీ సాయిచైతన్య ఆకస్మిక తనిఖీలు

Indalwai Checkpost Inspection | ఇందల్వాయి చెక్​పోస్ట్​ వద్ద సీపీ సాయిచైతన్య ఆకస్మిక తనిఖీలు

పశువుల అక్రమ రవాణాపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సీపీ సాయిచైతన్య ఇందల్వాయి చెక్​పోస్ట్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Indalwai Checkpost Inspection | పశువుల అక్రమ రవాణాపై పోలీసు శాఖ(Nizamabad Police) ప్రత్యేక దృష్టి సారించింది. బక్రీద్(bakrid)​ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పలు చెక్​పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సీపీ సాయిచైతన్య(cp sai chaitanya) ఇందల్వాయి చెక్​పోస్ట్​ను(indalwai checkpost) ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Indalwai Checkpost Inspection | సిబ్బందికి ఆదేశాలు

చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడి భద్రతా ఏర్పాట్లను సీపీ సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దుల ద్వారా అక్రమంగా పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. వాహనాల తనిఖీల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.

రాత్రి వేళల్లో రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించడం, బ్యారికేడ్లు, హెచ్చరిక లైట్లు వినియోగించడం, వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపి తనిఖీలు నిర్వహించడం వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చట్టవిరుద్ధంగా పశువుల రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డిచ్‌పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి ఎస్సై సందీప్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Bandi Bhagirath Case | బండి భగీరథ్ అరెస్ట్​ తప్పదా.. నోటీసులు జారీ చేసిన పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Gangadhara Sub Registrar | ఏసీబీ వలలో గంగాధర ఇన్​ఛార్జి సబ్ రిజిస్ట్రార్.. రూ. 1.06 లక్షల అక్రమ వసూళ్ల కేసులో అరెస్టు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gangadhara Sub Registrar | పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్...

T-SAT Education Department | ఇక విద్యాశాఖ పరిధిలోకి టీ-శాట్.. ఐటీ శాఖ నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: T-SAT Education Department | తెలంగాణ ప్రభుత్వ డిజిటల్...

లక్డీకాపూల్ గ్లెనీగిల్స్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక లేబర్ సూట్ ప్రారంభం

హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని గ్లెనీగిల్స్ హాస్పిటల్స్ (ఫోర్టిస్ నెట్‌వర్క్ హాస్పిటల్) మహిళల ఆరోగ్య...

Bandi Sanjay Statement | నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే : బండి సంజయ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay Statement | కేంద్ర మంత్రి...