Municipal Water Supply | తాగునీటి సరఫరాపై మున్సిపల్​ కమిషనర్​ సమీక్ష

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Municipal Water Supply | నగరంలో తాగునీటి సరఫరాపై కార్పొరేషన్​ కమిషనర్​ దిలీప్​కుమార్​ (Dilip Kumar) ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ మేరకు ఆయన కాలనీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన తాగునీటి సరఫరా తీరును పరిశీలించారు.

Municipal Water Supply | 12, 41వ డివిజన్లలో..

నగరంలోని 12, 41వ డివిజన్​లో కమిషనర్​ గురువారం పర్యటించారు. డివిజన్​లోని ఆయా కాలనీల్లో తిరుగుతూ తాగునీటి సరఫరా, శానిటేషన్​ జరుగుతున్న తీరుపై అధికారులతో మాట్లాడారు. అలాగే ఆయా కాలనీల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. ఖాళీ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ (Nizamabad Municipal Corporation)​ నీటిసరఫరాలో ఎక్కడా అంతరాయం ఏర్పడకూడదని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్​ ఈఈ, డీడీఈలు, ఏఈలు, శానిటేషన్​ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Mla Bhupathi reddy | విద్యపై ఖర్చు పెట్టడమంటే భవిష్యత్​ తరాలకు పెట్టుబడి లాంటిది: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *