అక్షరటుడే,కోటగిరి: Negligent Driving Accident | డివైడర్‌ను కారు ఢీకొనగా ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కోటగిరి (kotagiri) మండలం ఎత్తొండ క్యాంప్‌లో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
Negligent Driving Accident | అజాగ్రత్తగా కారు నడపడంతో..
ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండల కేంద్రానికి చెందిన యువకుడు ముత్తిపేట సాత్విక్ (19) మాశెట్టి ప్రతాప్ అనే వ్యక్తితో కారులో ఎత్తొండ వైపు వెళ్తున్నాడు. అయితే ఎత్తొండ క్యాంప్ (Etthonda Camp) అంబేడ్కర్ విగ్రహం వద్దకు రాగానే డ్రైవర్ ప్రతాప్ అజాగ్రత్తగా కారు నడపడంతో డివైడర్‌ను (car crash) ఢీకొట్టింది. ఈ ఘటనలో సాత్విక్ తల, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని బోధన్‌లోని (bodhan) ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాత్విక్ గురువారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: BJP Ticket Scam | ఇందూరు బీజేపీలో కలకలం.. కార్పొరేటర్ టికెట్ పేరిట డబ్బులు వసూలు..!


