ఆంధ్రప్రదేశ్​Tirupati Minor Assault | దారుణం.. 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్ లైంగిక దాడి

Tirupati Minor Assault | దారుణం.. 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్ లైంగిక దాడి

ఈ ఘటనపై పోలీసులు నిందితుడు రామమూర్తిపై పొక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati Minor Assault | హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని వేసవి సెలవుల సందర్భంగా తిరుపతిలో నివసిస్తున్న తన పిన్ని ఇంటికి వెళ్లగా, అక్కడ ఆమెపై సొంత బాబాయ్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tirupati Minor Assault | సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు రామమూర్తి, బాలిక ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. భయంతో ఈ విషయాన్ని కొంతకాలం పాటు బాలిక బయటకు చెప్పలేకపోయినట్లు సమాచారం.

Tirupati Minor Assault | జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి..

ఇటీవల బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లికి తెలియజేయడంతో ఆమె జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

ఈ ఘటనపై పోలీసులు నిందితుడు రామమూర్తిపై పొక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాలికల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

US Senator Comments|చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు…. ‘వీసా కార్టెల్’ అంటూ ఆరోపణలు

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Revanth Reddy Bandi Sanjay | బండి సంజయ్ తన కొడుకును వెంటనే పోలీసులకు అప్పగించాలి: సీఎం రేవంత్ రెడ్డి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Revanth Reddy Bandi Sanjay | కేంద్ర మంత్రి...

NEET Paper Leak | నీట్​ పేపర్​ లీకేజీలో కీలక నిందితుడి అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Paper Leak | నీట్ (NEET...

Telangana Udyamakarula Committee | తెలంగాణ ఉద్యమకారులకు ‘రాజ గౌరవం’.. జర్నలిస్టులకు గుర్తింపు లభించేనా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Udyamakarula Committee | స్వరాష్ట్ర కల సాకారం కోసం...

Nampally Railway Station | నాంపల్లి రైల్వే స్టేషన్​లో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nampally Railway Station | హైదరాబాద్ (Hyderabad)​...