అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy Convoy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని పోలీసులను ఆదేశించారు.
పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలని ఇటీవల ప్రధాని మోదీ (PM Modi) ప్రజలను కోరిన విషయం తెలిసిందే. ఆయన స్వయంగా తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. ప్రధాని సూచన మేరకు ప్రజలతో పాటు పలువురు నాయకులు ఇంధన పొదుపు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను నాలుగుకు తగ్గించారు.
Revanth Reddy Convoy | ప్రజలకు ఇబ్బందులు లేకుండా..
సీఎం, మంత్రుల కాన్వాయ్ వస్తే పోలీసులు ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిపి వేస్తారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఇప్పటికే ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మధ్యలో కాన్వాయ్‌ల కోసం వాహనాలను ఆపితే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తన కాన్వాయ్ కోసం వాహనాలను ఆపొద్దని సీఎం పోలీసులను ఆదేశించారు. ట్రాఫిక్ మధ్యనే కాన్వాయ్ వెళ్లాలని నిర్ణయించారు. కాగా ఇటీవల సీఎం శంషాబాద్ నుంచి తన నివాసానికి ట్రాఫిక్‌లోనే వచ్చారు. ఇదే విధానాన్ని అనుసరించాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
దీనిని కూడా చదవండి : Bandi Bhagirath Case | బండి భగీరథ్‌పై లుక్ అవుట్ నోటీసులు


