తెలంగాణTRS Flag Festival | టీఆర్ఎస్ జెండా గద్దె మోడల్ ఆవిష్కరణ.. నెల రోజుల పాటు...

TRS Flag Festival | టీఆర్ఎస్ జెండా గద్దె మోడల్ ఆవిష్కరణ.. నెల రోజుల పాటు జెండా పండుగకు ఏర్పాట్లు

రాష్ట్రవ్యాప్తంగా ఒకే మోడల్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో జెండా గద్దెల మోడల్‌ను ఆవిష్కరించారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: TRS Flag Festival | రాష్ట్రవ్యాప్తంగా ఒకే మోడల్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో జెండా గద్దెల మోడల్‌ను ఆమె ఆవిష్కరించారు.

TRS Flag Festival | రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా..

మూడు ఫీట్ల ఎత్తు, రెండు ఫీట్ల వెడల్పుతో పార్టీ జెండా గద్దెలు నిర్మించాలని కవిత సూచించారు. జెండా గద్దె బేస్ ఒక ఫీట్ ఎత్తులో, పైభాగం మరో రెండు ఫీట్ల ఎత్తులో ఉంటుందని తెలిపారు. జెండా గద్దె బేస్‌కు గ్రీన్ కలర్, పైభాగంలో ఉండే జెండా గద్దెకు ఎల్లో కలర్ వేయాలని, దాని మధ్యలో తెలంగాణ మ్యాప్‌ను బ్లూ కలర్‌లో ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లిష్ అక్షరాల్లో టీఆర్ఎస్ అని, జెండా గద్దె బేస్ గ్రీన్ కలర్ మధ్యలో తెలుగులో తెలంగాణ రక్షణ సేన అని రాయాలని స్పష్టం చేశారు.

పార్టీ జెండా కలర్ కోడ్స్ కూడా తాము ఇచ్చిన విధంగానే పాటించాలని, అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా జెండాలన్నీ ఏకరూపంలో కనిపిస్తాయని కవిత వెల్లడించారు. ఈనెల 20వ తేదీ నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు జెండా పండుగను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో, వార్డులో జెండా గద్దెల నిర్మాణం పూర్తి చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి..: Indiramma House | కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తానని వేధింపులు.. కాంగ్రెస్​ నాయకుడిపై పోలీసులకు మహిళ ఫిర్యాదు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు కొనసాగుతున్న మరమ్మతులు..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో...

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...