Tank Repair Works | చెరువుల మరమ్మతులపై అలసత్వం వహించొద్దు: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Tank Repair Works | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చెరువులు, చెక్​డ్యాంల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని.. అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. ఆ మేరకు ఎమ్మెల్యే తన నివాసంలో ఇరిగేషన్​ అధికారులతో సమావేశంమయ్యారు.

Tank Repair Works | వర్షాకాలం లోపు..

ముత్యాల చెరువు గత వర్షాకాలంలో దెబ్బతినగా వెంటనే మరమ్మతులు చేయించాలని మండలంలోని వాడి, హొన్నాజీపేట గ్రామ రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ మేరకు మరమ్మతు పనులకు సంబంధించిన ప్రణాళికను మ్యాప్ పాయింట్ ద్వారా ఎమ్మెల్యేకు అధికారులు వివరించారు. అదేవిధంగా చెరువు రక్షణార్థం ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంతో పాటు నియోజకవర్గంలోని చెక్​డ్యాంల అంశంపై చర్చించారు.

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల విడుదల తదితర అంశాలపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)కి లేఖ రాశారు. కాగా.. నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ నజీర్ హుస్సేన్, ఈఈ నరేంద్ర కుమార్, డీఈ ప్రేమ్ కుమార్, ఏఈలు సాయినాథ్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Paddy Procurement Centers | ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అధికారులు..‘అక్షరటుడే’ కథనానికి స్పందన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *