Friendly Policing | ఫ్రెండ్లీ పోలీసింగ్​పై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి : సీపీ సాయిచైతన్య

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Friendly Policing | ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్​ అందించడంపై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదో పోలీస్​స్టేషన్​ను మంగళవారం సీపీ (CP Sai Chaitanya) తనిఖీ చేశారు.

Friendly Policing | స్టేషన్​లో విభాగాల పరిశీలన..

స్టేషన్‌లో అన్ని విభాగాలను సీపీ సాయిచైతన్య క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్​లో సిబ్బందికి అందుబాటులో ఉన్న కిట్ ఆర్టికల్స్, భద్రతా పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం రిసెప్షన్ సెంటర్‌ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడిని గౌరవంతో స్వాగతించి, వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించే విధంగా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు.

Friendly Policing | రికార్డుల తనిఖీ..

పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించిన కమిషనర్.. కేసుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీట్ డ్యూటీ వ్యవస్థ, రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తును (Nizamabad police) వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

స్టేషన్‌లో అమలవుతున్న 5–ఎస్ విధానం అమలు తీరును సమీక్షించి, ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, అత్యవసర సాయం కోసం వచ్చే ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని స్పందించాలని తెలిపారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల డిజిటల్ నిర్వహణ, సిబ్బంది హాజరు, డ్యూటీ విధానాలు తదితర అంశాలపై కూడా పోలీస్ కమిషనర్ ఆరా తీశారు.

Friendly Policing | హెడ్‌ క్వార్టర్స్​లో అందుబాటులో ఉండాలి..

అనంతరం సిబ్బందిని ఉద్దేశించి సీపీ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది 24గంటలు హెడ్ క్వార్టర్స్​లో అందుబాటులో ఉండాలన్నారు. దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, సిబ్బంది ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి తమ హెల్త్ చెకప్(public safety) చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్​ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. తనిఖీలో ఏసీపీ ప్రకాష్ యాదవ్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, సీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ అంజయ్య, ఐదో టౌన్​ ఎస్సై గంగాధర్ , ఎస్సై–2 లక్ష్మయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Khammam CI Harassment | మహిళపై సీఐ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *