Car Accident | అదుపు తప్పి కారు బోల్తా.. వైద్యుడికి గాయాలు

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Car Accident | కారు అదుపు తప్పి బోల్తా పడడంతో వైద్యుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్(Nizamabad) నగర శివారులో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

Car Accident | జీజీహెచ్​లో వైద్యుడు..

రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని జీజీహెచ్​(GGH Nizamabad) వైద్యుడిగా పనిచేస్తున్న దశరథ్ సోమవారం అర్ధరాత్రి కంఠేశ్వర్ మీదుగా బైపాస్ వైపు వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు (Nizamabad rural Police) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: India Nordic Summit | ఇండియా – నార్డిక్​ సమ్మిట్​లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *