అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fast Track Court | పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ కామారెడ్డి(Kamareddy) జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు (fast track court) తీర్పునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ గురువారం వివరాలు వెల్లడించారు.
Kamareddy Fast Track Court | మాయమాటలు చెప్పి
తాడ్వాయి(Tadwai) మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని 2022 ఆగస్టు 5న స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాడ్వాయి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ అబ్దుల్ రహీం బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. బాలిక తాను మైనర్ అని పలుమార్లు చెప్పినా వినకుండా, ఆ రోజు కామారెడ్డి రైల్వే స్టేషన్‌కు (Kamareddy Railway Station) తీసుకెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి తరలించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి ఢిల్లీలో బాలికను గుర్తించి రక్షించారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై పోక్సో కేసు(pocso case) నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల శిక్ష ఖరారు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టి నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.
ఇది కూడా చదవండి: White Collar Jobs | ఏఐతో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు.. సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు


