క్రైంTransformer Coil Theft | 64 ట్రాన్స్​ఫార్మర్ల చోరీ.. ముఠాను పట్టుకున్న పోలీసులు

Transformer Coil Theft | 64 ట్రాన్స్​ఫార్మర్ల చోరీ.. ముఠాను పట్టుకున్న పోలీసులు

ట్రాన్స్​ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి కాయిల్స్​ చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సీపీ సాయి చైతన్య నిందితుల వివరాలు వెల్లడించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Transformer Coil Theft | నిజామాబాద్(nizamabad)​, కామారెడ్డి(Kamareddy), మెదక్(Medak)​ జిల్లాలలో ఏకంగా 64 ట్రాన్స్​ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్​ కార్యాలయంలో శుక్రవారం సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) వివరాలు వెల్లడించారు.

Transformer Coil Theft | రెంజల్ మండలంలో..

సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. రెంజల్ పీఎస్(Renjal) పరిధిలో ఎస్సై తన సిబ్బందితో సాఠాపూర్ బైపాస్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. మూడు బైక్​లపై వెళ్తున్న వీరివద్ద గన్నీ బ్యాగ్​లో ట్రాన్స్​ఫార్మర్​ కాయిల్స్ (Transformer Coil) బయటపడ్డాయి. దీంతో వారిని పట్టుకుని విచారించగా తాము చేసిన 64 ట్రాన్స్​ఫార్మర్ల​ కాయిల్స్​ చోరీల గుట్టు విప్పారు.

Transformer Coil Theft | మెదక్​, బోధన్​ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు..

మెదక్, బోధన్​కు చెందిన ఈ వ్యక్తులు ఒక గ్యాంగ్​గా ఏర్పడి 64 ట్రాన్స్​ఫార్మర్లను డ్యామేజ్​ చేసి కాపర్ కాల్స్ చోరీ చేశారు. నిజామాబాద్​ జిల్లాలోని నిజామాబాద్, రెంజల్, బోధన్ రూరల్, బోధన్ టౌన్, వర్ని, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్​పల్లి, జక్రాన్​పల్లి, ఇందల్వాయి ప్రాంతాల్లో 38 ట్రాన్స్​ఫార్మర్ల కాయిల్స్​ను చోరీ చేశారు. అలాగే కామారెడ్డి జిల్లాలో కామరెడ్డి, బాన్సువాడ, పిట్లం, మద్నూర్​, భిక్కనూరు, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, పెద్ద కొడప్​గల్​ ఏరియాల్లో మొత్తం 20 ట్రాన్స్​ఫార్మర్లను ధ్వంసం చేశారు.

Transformer Coil Theft | మెదక్​ జిల్లాలో..

మెదక్ జిల్లాలో మెదక్ రూరల్, చేగుంట, వెల్దుర్తి ఏరియాల్లో 4 ట్రాన్స్​ఫార్మర్లను వీరు ధ్వంసం చేసి కాయిల్స్​ని ఎత్తుకెళ్లారు. సిద్దిపేట జిల్లాలో రెండింటిని ధ్వంసం చేశారు. ఇలా నాలుగైదు జిల్లాలలో చోరీ చేసిన కాయిల్స్​ను సయ్యద్​ అక్బర్​ హుస్సేన్​, షేక్​ మహబూబ్​, మాలప్ప మాస్టర్​, తాయప్ప దంగల్​ అనే వ్యక్తుకు చెందిన స్క్రాప్ దుకాణాల్లో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ముఠాలో సభ్యులైన వనం సాయిలు, జగన్నాథం, వనం పోశెట్టి, ధనశ్రీ కిరణ్​, దాసరి పోచయ్య, ఇద్దరు వ్యాపారస్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

అధికారులు, సిబ్బందికి ప్రశంసలు..

నిందితుల వద్ద నుంచి 80 కేజీల రాగి కాయిల్స్​, మూడు బైక్​లు, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో కృషి చేసిన బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​, ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ,​ సీసీఎస్​ ఇన్​స్పెక్టర్ సాయినాథ్, రెంజల్​ ఎస్సై​ చంద్రమెహన్​, బోధన్​ రూరల్​ ఎస్సై​ మచ్ఛేందర్​రెడ్డి, సీసీఎస్​ ఎస్సై విఠల్​, సీసీఎస్​ హెడ్​కానిస్టేబుల్​ వెంకట్రామ్​, హెచ్​పీఎల్​ రవి, విశాల్​, కృష్ణలను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.

Transformer Theft, Copper Coil Theft, Telangana Crime, Nizamabad Police, Kamareddy News, Medak Crime, Theft Gang Arrest, Transformer Damage

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mopal Police Arrest | ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడి అరెస్టు

అక్షరటుడే, డిచ్​పల్లి(మోపాల్): Mopal Police Arrest | నిజామాబాద్​ జిల్లా మోపాల్...

Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో నివురుగప్పిన నిప్పులా ‘మాఫియా’ వివాదం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jukkal MLA Comments | తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు...

SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH vs RCB | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో...