తెలంగాణBasaveshwara Jayanthi | బసవేశ్వర భవన్​కు శంకుస్థాపన చేస్తాం : మంత్రి పొన్నం

Basaveshwara Jayanthi | బసవేశ్వర భవన్​కు శంకుస్థాపన చేస్తాం : మంత్రి పొన్నం

త్వరలో బసవేశ్వర భవన్​కు శంకుస్థాపన చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. బసవేశ్వరుడి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Basaveshwara Jayanthi | తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వరుడి జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)​, వాకిటి శ్రీహరి హాజరయ్యారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సమానత్వం, సామాజిక న్యాయం, నైతిక జీవన విలువలను బోధించిన వ్యక్తి బసవేశ్వరుడన్నారు. ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవాలని, ఆచరించాలన్నారు. బసవేశ్వరుని గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని, త్వరలోనే ‘బసవేశ్వర భవన్’కు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.

Basaveshwara Jayanthi | కుల వివక్ష నిర్మూలనకు..

రాహుల్ గాంధీ (Rahul Gandhi) బసవేశ్వరుడి స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర చేపట్టారని పొన్నం పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు బసవేశ్వరుని తత్వం గురించి తెలియజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. బసవేశ్వరుడు కుల వివక్ష నిర్మూలనకు కృషి చేశారని, మానవులందరూ సమానమే అనే సూత్రాన్ని వ్యాప్తి చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. స్త్రీలకు సమాన హక్కులను సమర్థించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Harish Rao Delhi Tour | బీఆర్​ఎస్​లో ముసలం.. కాంగ్రెస్​ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....