SBI Employees Candle Rally | ఎస్​బీఐ ఉద్యోగుల క్యాండిల్​ ర్యాలీ..

shashi kiran Mottala

​అక్షరటుడే, ఇందూరు: SBI Employees Candle Rally | స్టేట్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (State Bank of India Staff Federation) పిలుపులో భాగంగా శుక్రవారం నిజామాబాద్(Nizamabad) నగరంలో స్టేట్ బ్యాంకు ఉద్యోగులు (SBI) భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ప్రగతిభవన్ శాఖ (Pragathi Bhavan) ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించిన అనంతరం, అక్కడి నుంచి నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

SBI Employees Candle Rally | లేబర్​ కమిషనర్​తో అసంపూర్తిగా చర్చలు..

​ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. గురువారం డిప్యూటీ లేబర్ కమిషనర్‌తో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయన్నారు. ఆదివారం జరిగే తదుపరి చర్చల్లో యాజమాన్యం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని, ఒకవేళ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈనెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెను భారీ ఎత్తున నిర్వహించి విజయవంతం చేస్తామన్నారు.

నూతన పెన్షన్ విధానం (ఎన్‌పీఎస్) (NPS) ఉద్యోగుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతోందని, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) (OPS) తక్షణమే తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

SBI Employees Candle Rally | ​సిబ్బంది కొరతతో పనిభారం..

బ్యాంకుల్లో రోజురోజుకూ పనిభారం పెరుగుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మెసెంజర్లు, ఆర్మ్డ్ గార్డులతో పాటు ఖాళీగా ఉన్న ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై తీవ్ర మానసిక ఒత్తిడి పడుతోందని విమర్శించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజా రంగ బ్యాంకులను బలోపేతం చేయడమే దేశ ఆర్థిక వ్యవస్థకు శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు.

రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు, ఆరోగ్య భద్రతా పథకాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ​ఈ క్యాండిల్ ర్యాలీలో బ్యాంకు ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని డిమాండ్లకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రమేష్, గురునాథ్, శ్రీనివాస్, సునంద, ప్రమోద్, సుధాకర్, అర్చన తదితరులు పాల్గొన్నారు.

bank1

ఇది కూడా చదవండి: Deputy Collector ACB Case | డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తులు మాములుగా లేవుగా!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *