అక్షరటుడే, కామారెడ్డి: Annapurna Seva Rath | జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ రథాన్ని ఏర్పాటు చేశామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలో (Kamareddy) ఆదివారం రథాన్ని ఆయన తల్లి గడ్డం విజయలక్ష్మి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.
Annapurna Seva Rath | అన్ని మండలాల్లో పర్యటిస్తూ.. నిరుపేదలకు..
ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. జీసీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రారంభించిన అన్నపూర్ణ రథం కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పర్యటిస్తూ పేద, నిరుపేద ప్రజలకు ఆహారాన్ని అందిస్తుందని తెలిపారు.
ప్రజాసేవే లక్ష్యంగా, పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే ధ్యేయంగా జీసీఆర్ ట్రస్ట్ నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గడ్డం ఇందు ప్రియ, కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు, కౌన్సిలర్ గడ్డమీది మహేష్, డీసీసీ ఉపాధ్యక్షుడు పంపరి లక్ష్మణ్, సబ్బని కృష్ణ హరి, డీసీసీ జనరల్ సెక్రటరీ జూలూరి సుధాకర్, సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడు మెహర్ బాబాగౌడ్, కామారెడ్డి మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, సలీం, సుగుణ, చింతల రవీందర్ గౌడ్, చాట్ల వంశీ, పిడుగు సాయిబాబా, కామారెడ్డి జిల్లా పద్మశాలి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, రంగ రమేష్ గౌడ్, బండారి శ్రీకాంత్, అరవింద్, ఆబిద్, యూత్ నాయకులు పండు శ్రీకాంత్, ఆకాష్, నిరంజన్, సేవాదళ్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: దేవ ఉత్థాన ఏకాదశి స్పెషల్..ఇక ఆగిపోయిన శుభకార్యాలన్నీ షురూ..