అక్షరటుడే, వెబ్‌డెస్క్: Free medical camp | నిజామాబాద్ Nizamabad జిల్లా చందూర్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచి సంజీవ్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో నిజామాబాద్‌కు చెందిన చర్మ, కేశ వైద్య నిపుణులు, శ్రీముఖి స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ వైద్యులు డాక్టర్ నునావత్ మధుకర్, శ్రీ భవానీ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన జనరల్, లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ పి. శ్రీలత రాథోడ్ పాల్గొని గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు.
Free medical camp | మందుల పంపిణీ
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా వైద్య సలహాలు అందించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని డాక్టర్ మధుకర్, డాక్టర్ శ్రీలత రాథోడ్ తెలిపారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Free medical camp | సమాజ అభివృద్ధికి పునాది
గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని, గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించిన వైద్యులకు గ్రామ సర్పంచి సంజీవ్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల ఆరోగ్యమే సమాజ అభివృద్ధికి పునాది అని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని వైద్యులు పేర్కొన్నారు. వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సర్పంచి సంజీవ్‌కు, గ్రామ ప్రజలకు, నిర్వాహకులకు వైద్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..