KTR Nirmal Rythu Garjana | పాలమూరు పొలాలు ఎండిపోతుంటే.. ఏపీకి నీళ్లు పోస్తుంటే సమాధానం చెప్పవా రేవంత్? : నిర్మల్ ‘రైతు గర్జన’లో కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు!

పంట కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లేక రైతులు ఆగం అవుతున్నారని KTR ధ్వజమెత్తారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR Nirmal Rythu Garjana | కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ Telangana రైతాంగంపై తీవ్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఏడాది తిరగకముందే రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నిర్మల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ‘రైతు గర్జన’ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

చదువుల తల్లి సరస్వతి దేవి కొలువున్న పుణ్యభూమిగా, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కళాఖండాల నిలయంగా, కేసీఆర్​కి తెలంగాణ ఉద్యమ ఆలోచనలకు ఊపిరి పోసిన సెంటిమెంట్ నేల నిర్మల్ అని కొనియాడారు.

KTR Nirmal Rythu Garjana | రైతు గర్జన వేదికగా కేటీఆర్ సంధించిన ప్రశ్నాస్త్రాలు..

  • “పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్లు ఎత్తిపోస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు చూస్తున్నారు?”
  • “కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కాళేశ్వరం మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదు?”
  • “శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు చంద్రబాబు స్వంత నియోజకవర్గం కుప్పం దాకా తరలిపోతుంటే మన పాలమూరు రైతు పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయి?”

ఈ ప్రశ్నలకు రేవంత్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

KTR Nirmal Rythu Garjana | కేసీఆర్ హయాంలో రైతే రాజు

దేశమంతా తెలంగాణ వైపు చూసేలా గతంలో కేసీఆర్ పాలన సాగిందని కేటీఆర్ గుర్తుచేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, 11 విడతల్లో సుమారు ₹73,000 కోట్ల రైతుబంధు నిధులు నేరుగా ఖాతాల్లో వేయడంతో పాటు ₹5 లక్షల ఉచిత రైతుబీమాను అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

KTR Nirmal Rythu Garjana | కాంగ్రెస్ పాలనలో ఆగమైన రైతాంగం

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటికే మూడు విడతల రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టారని విమర్శించారు. రైతుబీమా పథకాన్ని నీరుగార్చారని, గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని, పంట కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లేక రైతులు ఆగం అవుతున్నారని ధ్వజమెత్తారు.

‘గులాబీ జెండానే శ్రీరామరక్ష’

రైతాంగం ఎదుర్కొంటున్న ఈ ఆవేదనకు, కాంగ్రెస్ వైఫల్యాలకు వ్యతిరేకంగానే ఈ ‘రైతు గర్జన’ సభను నిర్వహించామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో మళ్లీ రైతు రాజ్యం రావాలన్నా, వ్యవసాయం పండుగలా మారాలన్నా కేసీఆర్ నాయకత్వంలోని గులాబీ జెండా మళ్లీ ఎగరాలని, కేసీఆర్ తిరిగి సీఎం కావడమే ఏకైక మార్గమని ఆయన పిలుపునిచ్చారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *