RTC Metro Common Pass | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. భారీగా తగ్గనున్న ఆర్టీసీ, మెట్రో కామన్​ పాస్​ ధరలు

ఆర్టీసీ, మెట్రో కామన్​ పాస్ ధరలను త్వరలో తగ్గించనున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: RTC Metro Common Pass | హైదరాబాద్​ (Hyderabad) వాసులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గుడ్​ న్యూస్​ చెప్పింది. ఆర్టీసీ, మెట్రో కామన్​ పాస్​ ధరలను భారీగా తగ్గించనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల కోసం గతంలో ఆర్టీసీ, మెట్రో కామన్​ పాస్​ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మంత్లీ పాస్​ ధరను రూ.8,500గా నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్​ కామన్​ పాస్​ను అట్టహాసంగా ప్రారంభించారు. అయితే ధర అధికంగా ఉందని ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రైవేట్ కంపెనీల్లో చిన్న ఉద్యోగాలు చేసే వారి జీతమే రూ.15 వేల వరకు వస్తుండగా.. అందులో మెట్రో, ఆర్టీసీ పాస్​ కోసం సగానికి పైగా ఎలా చెల్లిస్తారని పలువురు ప్రశ్నించారు. అంతేగాకుండా ఆ పాస్​లను తీసుకోవడానికి ఎవరు ఆసక్తి చూపలేదు.

RTC Metro Common Pass | సీఎం ఆదేశాలతో..

ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో సీఎం రేవంత్​రెడ్డి పాస్​ ధరలను తగ్గించాలని ఆదేశించారు. దీంతో అధికారులు పాస్​ ధరలను తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నెలవారీ పాస్ ధరను రూ.8,500 నుంచి రూ.4,500కు, డెయిలీ పాస్​ ధరను రూ.400 నుంచి రూ.325కు తగ్గించనున్నారు. ఈ కామన్ పాస్ ద్వారా టీజీఎస్ఆర్టీసీ సిటీ బస్సుల్లో, మెట్రో రైలులో అపరిమితంగా ప్రయాణించవచ్చు. ధరల తగ్గింపునకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. కామన్​ పాస్​ ధరలు తగ్గితే ప్రయాణికులకు మేలు జరగనుంది.

ఇది కూడా చదవండి..: Green SM cabs | హైదరాబాద్‌లోకి వియత్నాం ఎలక్ట్రిక్ క్యాబ్స్ ‘గ్రీన్ ఎస్ఎం’.. కిలోమీటర్‌కు రూ.9 మాత్రమే! ఓలా, ఉబెర్ డ్రైవర్లలో ఆందోళన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *