అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Drunk Drive Checks | నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ (Nizamabad Police) పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను పక్కాగా నిర్వహిస్తున్నామని సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
Drunk Drive Checks | వారం రోజుల్లో 162 మందికి జరిమానాలు..
గత వారం రోజుల్లో నిజామాబాద్(Nizamabad), బోధన్(Bodhan),ఆర్మూర్(Armoor), ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు జరిగాయని సీపీ తెలిపారు. ఇందులో భాగంగా 162 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించామన్నారు. అనంతరం వారిని ఆయా కోర్టులలో ప్రవేశపెట్టగా 160 మందికి రూ.16 లక్షల జరిమానాలు విధించారని ఇద్దరికి వారం రోజులపాటు కోర్టు జైలుశిక్ష విధించినట్లు ఆయన తెలిపారు.
Drunk Drive Checks | డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతర ప్రక్రియ..
జిల్లాలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిరంతర ప్రక్రియ అని మద్యం తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు నిరంతరం నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల వారితో పాటు ఇతరులకు సైతం ప్రాణహాని ఉన్నదని.. ఇలాంటివారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఈ తనిఖీల్లో పట్టుబడ్డ వారి లైసెన్స్‌ను ఆర్నెళ్లపాటు సస్పెండ్ చేయడం జరుగుతుందని మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదం జరిగితే ఎలాంటి ఇన్సూరెన్స్ వర్తించదని ఆయన తెలియజేశారు. మైనర్లు వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు దొరికితే ఓనర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: PCC Chief Comments | ‘మీడియా’ కథనాలపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు


