తెలంగాణInter College Midday Meal | ఇంటర్​ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. కేబినెట్ కీలక నిర్ణయం

Inter College Midday Meal | ఇంటర్​ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకానికి ఆమోదం తెలిపింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter College Midday Meal | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన శనివారం సాయంత్రం మంత్రివర్గం సమావేశం అయింది. సచివాలయంలో నిర్వహించిన ఈ మీటింగ్​లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్​ కాలేజీల్లో సైతం మధ్యాహ్న భోజనం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రభుత్వ జూనియర్​ కాలేజీల వరకు విద్యార్థులకు నిత్యం ఉదయం అల్పాహారం (Breakfast) అందించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను గతంలో సీఎం ప్రకటించగా.. తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అల్పాహారంతో పాటు ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించనున్నారు.

Inter College Midday Meal | ధాన్యం కొనుగోళ్లపై..

హ్యామ్‌ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లలో కీలక మార్పులపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. అలాగే ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై చర్చించారు. ప్రస్తుతం కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మంత్రులు పలు సూచనలు చేశారు. 2027 గోదావరి పుష్కరాలకు రూ.1,000 కోట్లు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తొలివిడతగా రూ.300 కోట్లు విడుదలకు ఓకే చెప్పింది.

Inter College Midday Meal | మూడు కార్లతో సీఎం కాన్వాయ్​

మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడానికి సీఎం రేవంత్​రెడ్డి జూబ్లీహిల్స్​లోని తన నివాసం నుంచి సచివాలయానికి వచ్చారు. అయితే ఆ సమయంలో ఆయన మూడు కార్ల కాన్వాయ్​లో రావడం గమనార్హం. ప్రధాని మోదీ (PM Modi) సూచన మేరకు ఆయన తన కాన్వాయ్​ను తగ్గించారు. అంతేగాకుండా ట్రాఫిక్‌ను నిలిపివేయకుండానే సచివాలయానికి చేరుకున్నారు. అధిక భద్రత, జామర్ల హంగులు లేకుండానే, కేవలం మూడు వాహనాల కాన్వాయ్‌తో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు.

దీనిని కూడా చదవండి : PCC Chief Comments | ‘మీడియా’ కథనాలపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 24 Horoscope | ఇవాళ ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 24 Horoscope : గ్రహస్థితుల ఆధారంగా మేషం...

Telangana Cabinet Decisions | రెండో విడత ఇళ్లు.. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Cabinet Decisions | తెలంగాణలో రెండో విడ‌త...