అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Collector Ila Tripathi | తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శమని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. సచివాలయంలో సోమవారం 8వేల ‘స్త్రీ శక్తి’ (Sthree Shakti) భవనాలకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.
Collector Ila Tripathi | మహిళా వారోత్సవాల సందర్భంగా..
మహిళా వారోత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నాలుగు కొత్త డిజైన్ల ఇందిరమ్మ చీరలను(Indiramma Sarees) కూడా సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితి రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. డీమార్ట్(Dmart), బిగ్ బజార్లకు పోటీగా ‘మహిళా శక్తి సూపర్ బజార్లు’ ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు(Grain Procurement), నిల్వ, మిల్లింగ్ బాధ్యతలు మహిళా సంఘాలకే అప్పగించనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 1000 ఆర్టీసీ బస్సుల కొనుగోళ్లు చేస్తున్నామని.. జూన్ 5న 553 బస్సులు ప్రారంభిస్తామన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లాలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



