ACB Trap | భూ సర్వే చేసినందుకు లంచం.. ఏసీబీకి చిక్కిన సర్వేయర్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. అన్ని శాఖల్లో తిష్ట వేసి ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. కొందరైతే లంచం తీసుకోవడం కూడా తమ జాబ్​లో భాగంగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ సర్వేయర్​ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ కమ్మరి బ్రహ్మయ్య రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. మండలంలోని ఓ కుటుంబం తమ భూమిని సర్వే చేయాలని తహశీల్దార్​ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. భూమి సర్వే చేసినందుకు సర్వేయర్​ రూ.15 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.

ACB Trap | గతంలో రూ.5 వేలు

ఫిర్యాదిదారుని తల్లిదండ్రులకు చెందిన భూమిని సర్వే చేసినందుకు నిందితుడు బ్రహ్మయ్య మంగళవారం రూ.10 వేలు లంచం తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కాగా నిందితుడు గతంలో రూ.5 వేల లంచం తీసుకున్నాడు. మహబూబ్‌నగర్ రేంజ్ యూనిట్ ఏసీబీకి అధికారులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

bribe

ACB Trap | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

ఇది కూడా చదవండి : New Pensions | జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు.. అర్హతలు, కావాల్సిన సర్టిఫికెట్లు ఇవే..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *