Paddy Procurement Protest | వడ్లు కొనడం లేదని సొసైటీకి తాళం వేసి నిరసన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paddy Procurement Protest | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాల్లో ఇంకా 50 శాతం ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. దీంతో రైతులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎర్రటి ఎండలను లెక్ చేయకుండా రోడ్డుపై ధర్నాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. లారీలు రాక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్​ నేత సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.

Paddy Procurement Protest | రెండు నెలలైనా..

రెండు నెలలైనా వడ్లు కొనడం లేదని సిబ్బంది ఉండగానే సహకార సంఘ కార్యాలయానికి తాళం వేసిన ఘటన రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో చోటు చేసుకుంది. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి కాంగ్రెస్ నాయకుడు, జిల్లెల్ల మాజీ ఉప సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తాలం వేశారు. సెంటర్లో వడ్లు పోసి రెండు నెలలు అవుతున్నా కాంటా వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది లోపల ఉండగానే తాళం వేసి తన నిరసన తెలిపాడు. ప్రభుత్వం స్పందించి ధాన్యం  కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు.

దీనిని కూడా చదవండి : T-Fiber Internet | ప్రతి గ్రామానికి టీ-ఫైబర్ ఇంటర్నెట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *