Booth Level Agents | బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంలో జాప్యం తగదు

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Booth Level Agents | బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం విషయంలో రాజకీయ పార్టీలు జాప్యం చేయకుండా నిర్ణీత ఫార్మాట్​లో పేర్లను అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) ప్రక్రియ అమలులో బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకమని వారి నియామకంలో తాత్సారం చేయవద్దన్నారు. కలెక్టరేట్​లో అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్​వోల, ఏఈఆర్​వోలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

Booth Level Agents | పారదర్శకతతో కూడిన ఓటరు జాబితా

పారదర్శతతో కూడిన ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్ఐఆర్​ను అమలు చేస్తోందని కలెక్టర్​ అన్నారు. ఈ మేరకు నిర్ణీత షెడ్యూల్​ను కూడా వెలువరించిందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘంచే గుర్తింపు కలిగిన అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. నిర్ణీత ఫార్మాట్​లో వారి వివరాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఈఆర్​వోలను ఆదేశించారు. బీఎల్ఏల నియామకం కోసం ఇప్పటికే రాజకీయ పార్టీలను లిఖిత పూర్వకంగా కోరినప్పటికీ, ఇంకా వివరాలు అందించలేదన్నారు.

కేవలం ఒక పార్టీ మాత్రమే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బీఎల్ఏల(BLO) వివరాలు సమర్పించిందని తెలిపారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ అమలుకు సంబంధించి బీఎల్ఏలకు శిక్షణ తరగతులు నిర్వహించాల్సి ఉందని, అంతేకాకుండా ముసాయిదా ఓటరు జాబితాలోని అంశాలపై ఏవైనా అభ్యంతరాలుంటే, బీఎల్ఏలు వాటిని ప్రస్తావించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

Booth Level Agents | ఈఆర్​వోలు పార్టీలతో సమావేశమవ్వాలి

ఈఆర్​వోల స్థాయిలో ప్రతివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు తీరు గురించి వారికి వివరాలు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్​వోలు ప్రతి ఇంటిని సందర్శించి ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. బీఎల్​వోలకు సహకారం అందించేందుకు వీలుగా వలంటీర్లను సమకూర్చాలన్నారు. చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన, రెండు చోట్ల పేర్లు కలిగిన ఓటర్లను మ్యాపింగ్ సందర్భంగా కచ్చితంగా గుర్తించేలా చూడాలన్నారు. తప్పులు లేకుండా ఎన్యుమరేషన్ ఫారం ఎలా నింపాలనే దానిపై బీఎల్​వోలకు సమగ్రంగా అర్ధమయ్యే రీతిలో శిక్షణ అందించాలని ఆదేశించారు.

అన్ని పోలింగ్ బూత్​ల పరిధిలో వీఐపీలు, వీవీఐపీ ఓటర్లు ఉంటే, వారి మ్యాపింగ్ పూర్తయ్యిందా లేదా అన్నది ఈఆర్​వోలు స్వయంగా పరిశీలన జరపాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ (Armoor) సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ (Nizamabad) ఆర్డీవో రాజేంద్రకుమార్, బాన్సువాడ (Banswada) ఆర్డీవో రవీందర్ రెడ్డి, బోధన్ ఆర్డీవో విజయ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్​వోలు పాల్గొన్నారు.

coll5

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *