అక్షరటుడే, వెబ్‌డెస్క్: Muski Lake Protection | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చెరువుల పరిరక్షణకు హైడ్రా చర్యలు చేపడుతోంది. చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తోంది. ఇటీవల కోకాపేట కొత్త చెరువులో నిర్మాణాలను తొలగించిన హైడ్రా తాజాగా.. నార్సింగిలో ముష్కి చెరువు పరిరక్షణకు చర్యలు చేపట్టింది.
నార్సింగి (Narsingi)లో ముష్కి చెరువు 60 ఎకరాల్లో ఉంది. అయితే ఇందులో 10 ఎకరాల మేర ఇప్పటికే పలువురు కబ్జా చేశారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు ఇచ్చారు. శనివారం ఉదయం ఆక్రమ నిర్మాణాలను తొలగించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.
Muski Lake Protection | హద్దులు గుర్తించి…

ముష్కి చెరువులో ఆక్రమణలపై దృష్టి సారించిన అధికారులు ఉదయం నుంచే రంగంలోకి దిగారు. హైడ్రా, ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువు హద్దులను గుర్తించి కంచె ఏర్పాటు చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చెరువు పరిధిలో ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. చెరువు భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.
ఇది కూడా చదవండి..: Gandipet Land Scam | గండిపేటలో రూ.1500 కోట్ల భూ కుంభకోణం.. ముగ్గురు అరెస్ట్


