అక్షరటుడే వెబ్‌డెస్క్: Kishan Reddy Criticism | తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రక్రియ చాలా దారుణంగా తయారైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)మండిపడ్డారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు, దళారులు, ప్రభుత్వం కలిసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు.

Kishan Reddy Criticism | బస్సు యాత్రతోనే ప్రభుత్వంలో కదలిక..
ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రావడానికే తాము బస్సు యాత్ర చేపట్టామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం సేకరించడం లేదంటూ ముఖ్యమంత్రి, మంత్రులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. అసలు ధాన్యం సేకరించాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 58.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేంద్ర, రాష్ట్రాల మధ్య స్పష్టమైన ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు.

Kishan Reddy Criticism |దృష్టి అంతా కమీషన్లపైనే..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమీషన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపైనే శ్రద్ధ పెడుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి సరైన ప్రణాళికలు లేవని ఆయన ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Tejaswini Dance Video | నందమూరి అభిమానులను ఫిదా చేస్తున్న తేజస్విని.. డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్!


