తెలంగాణRahul Revanth BC Justice | బీసీలకు న్యాయం చేస్తున్న రాహుల్, రేవంత్

Rahul Revanth BC Justice | బీసీలకు న్యాయం చేస్తున్న రాహుల్, రేవంత్

అగ్ర కులాలకు చెందిన వారైనా కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలు బీసీలకు న్యాయం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి.హన్మంత్ రావు అన్నారు.

అక్షరటుడే, కామారెడ్డి: Rahul Revanth BC Justice | అగ్ర కులాలకు చెందిన వారైనా కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డిలు బీసీలకు న్యాయం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి.హన్మంత్ రావు అన్నారు.

జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మంత్ రావు మాట్లాడుతూ.. దేశానికి మూడు సార్లు నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని, ఆయన బీసీ అయి కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు.

Rahul Revanth BC Justice | బీసీల గురించి ఆలోచించే నేతలు

Rahul Revanth BC Justice

అగ్ర కులానికి చెందిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీసీల గురించి ఆలోచిస్తున్నారని వీహెచ్​ తెలిపారు. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 4500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీల కన్నా బీసీలు ఎక్కువగా ఉన్నారని, బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని గమనించారని చెప్పారు. అందుకే బీసీల లెక్క తేల్చాలని నిర్ణయించారని, దేశవ్యాప్తంగా కులగణన జరగాలని పట్టుబట్టారని వివరించారు.

Rahul Revanth BC Justice | అందుకే జనగణన నిర్ణయం

Rahul Revanth BC Justice

జనాభా ప్రాతిపదికన బీసీలకు న్యాయం జరగాలని కోరడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) జనగణన చేపట్టడానికి నిర్ణయించిందని హన్మంత్​ రావు పేర్కొన్నారు. అయితే జనగణనలో కులగణన వద్దని మెలిక పెట్టిందని ఆరోపించారు. కులగణన చేపడితే బీసీల లెక్క తేలుతుందని, ఈ విషయమై కోర్టుకు వెళ్తే కులగణన చేయాల్సిందేనని తీర్పు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ (Telangana)లో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో కులగణన చేయాలని నిర్ణయించి రూ.150 కోట్లు కేటాయించారని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం పొందాక ఫైల్​ను గవర్నర్​కు పంపారని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Advocates Protection Act | అమలులోకి తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...