Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - అంతర్జాతీయం

అంతర్జాతీయం

Apache Helicopter Crash | హర్మూజ్ వద్ద కూలిన అమెరికా అపాచీ యుద్ధ హెలికాప్టర్.. ఇది ఇరాన్ పనేనా?

అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన ‘అపాచీ’ సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది.

Shivam nagarani
Last updated: June 9, 2026, 12:28 pm 12:28 pm
Shivam nagarani
Share
Apache Helicopter Crash

అక్షరటుడే వెబ్‌డెస్క్: Apache Helicopter Crash | అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన ‘అపాచీ’ సైనిక హెలికాప్టర్ ( Apache Helicopter ) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ.. అందులోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ విధించిన ఆంక్షలను, దిగ్బంధనాన్ని ఛేదించేందుకు అమెరికాకు చెందిన యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) అక్కడ పహారా కాస్తోంది. అపాచీ హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, డ్రోన్లతో అమెరికా దళాలు నిఘా పెట్టిన సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Apache Helicopter Crash | ఇరాన్ దాడులా? సాంకేతిక లోపమా?

అయితే, ఇదే సమయంలో అమెరికాకు చెందిన రీపర్ డ్రోన్లను తాము కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. దీంతో ఈ అపాచీ హెలికాప్టర్ ఇరాన్ జరిపిన కాల్పుల వల్ల కూలిపోయిందా? లేక ఏదైనా సాంకేతిక లోపం వల్ల ప్రమాదానికి గురైందా? అనే కోణంలో అమెరికా రక్షణ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు మొదలైనప్పటి నుంచి యూఎస్ సైన్యానికి చెందిన హెలికాప్టర్ ఒకటి కూలిపోవడం ఇదే మొదటిసారి.

Apache Helicopter Crash | ఇరాన్ సైన్యం పూర్తిగా బలహీనపడింది..

అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన దాడుల వల్ల ఇరాన్ సైన్యం తీవ్రంగా నష్టపోయిందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహ్రాన్ వద్ద కేవలం 21 శాతం క్షిపణి సామర్థ్యం మాత్రమే మిగిలి ఉందన్నారు. ఇరాన్ గనుక మళ్లీ దాడులకు దిగితే గట్టి బుద్ధి చెప్పడానికి అమెరికా సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు.

Apache Helicopter Crash | అమెరికాకూ భారీ నష్టం..

మరోవైపు ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధంలో తమ సైన్యం కూడా భారీ మూల్యాన్నే చెల్లించుకుందని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ దాడుల కారణంగా ఇప్పటివరకు 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా, 399 మంది గాయపడినట్లు అధికారికంగా ప్రకటించింది. వీటితో పాటు అమెరికాకు చెందిన కొన్ని యుద్ధ విమానాలు కూడా ఈ ఘర్షణల్లో కూలిపోయాయని సెంట్‌కామ్ స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానిస్తూ.. ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ హెచ్చరించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: Interlink Power Supply | ఇంటర్​లింక్​ వ్యవస్థతో నిరంతరాయంగా విద్యుత్​ సరఫరా: ట్రాన్స్​కో ఎస్​ఈ

TAGGED:Apache GunshipApache Helicopter CrashDefense NewsDonald Trumpiran us tensionslatest newsMiddle East conflictStrait of Hormuztelugu newsUS Military News
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Fish Prasadam Distribution  Fish Prasadam Distribution | కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ
Next Article TG TET Hall Tickets TG TET Hall Tickets | టెట్​ హాల్​టికెట్ల విడుదల
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Nara Lokesh Mahanadu
ఆంధ్రప్రదేశ్​

Nara Lokesh Mahanadu | లోకేశ్ సస్పెన్స్ ట్వీట్.. ఆ ‘కీలక ప్రకటన’ ఏంటి?

By Shivam nagarani
Tanuja Murder Case
క్రైం

Tanuja Murder Case | రిటైర్డ్​ ఐపీఎస్ భార్య హత్య కేసు.. పనిమనుషుల విషయంలో పోలీసుల కీలక హెచ్చరిక

By Shivam nagarani
CBSE 12th Results
జాబ్స్​ & ఎడ్యుకేషన్​

CBSE 12th Results| సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

By Shivam nagarani
Voter List Revision
జాతీయం

Voter List Revision | సర్ నిర్వహణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.