Asifabad Forest Tension | ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న రైతులు.. ఆసిఫాబాద్​ జిల్లాలో ఉద్రిక్తత

మొక్కలు నాటడానికి వెళ్తున్న ఫారెస్ట్ అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asifabad Forest Tension | మొక్కలు నాటడానికి వెళ్తున్న ఫారెస్ట్ అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా (Asifabad District)లో చోటు చేసుకుంది.

చింతలమానేపల్లి మండలంలో దిందాలో పోడు భూమి వివాదం నెలకొంది. రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చసుకుంది. భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు వెళ్లారు. వారిని స్థానికులు అడ్డుకున్ఆనరు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

Asifabad Forest Tension | పలువురి అరెస్ట్

అటవీ శాఖ అధికారుల వాహనాలకు అడ్డుగా పడుకుని స్థానికుల నిరసన తెలిపారు. దీంతో కొందరు స్థానికులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోడు భూములను అటవీ శాఖ చదును చేస్తుండగా.. తమ సాగు భూములను నాశనం చేస్తున్నారని రైతుల ఆందోళన చేశారు. దీంతో గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి..: Fish Prasadam Distribution | కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *