అక్షరటుడే వెబ్‌డెస్క్: Mohan Naik ACB Raid | హైదరాబాద్‌లో రోడ్లు, భవనాల శాఖ (R&B) ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) గా పనిచేస్తున్న జే. మోహన్ నాయక్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ సోదాలు చేపట్టారు. ఆయన అధికార దుర్వినియోగం చేసి ఆదాయానికి మించి వందల కోట్ల రూపాయల ఆస్తులు పోగేశారనే ఆరోపణలపై ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచే ఈ మెరుపు దాడులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 ప్రాంతాలలో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతుండగా, హైదరాబాద్‌లోని నివాసంతో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా అధికారులు జల్లెడ పడుతున్నారు.
Mohan Naik ACB Raid | ముమ్మరంగా తనిఖీలు..
ఈఎన్సీ మోహన్ నాయక్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్‌పూర్ తండా కావడం, అలాగే ఆయన గతంలో ఈ జిల్లాలోనే ఆర్‌అండ్‌బీ శాఖలో వివిధ హోదాల్లో పనిచేయడంతో ఇక్కడ తనిఖీలు ముమ్మరంగా సాاగుతున్నాయి. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే నాలుగు ఏసీబీ బృందాలు మొత్తం 8 ప్రాంతాల్లో ఉదయం నుంచి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. కులాస్‌పూర్ తండాలోని మోహన్ నాయక్ నివాసంతో పాటు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఎల్ఎన్ గార్డెన్ పరిసరాల్లో ఉన్న ఆయన బావమరిది, రెవెన్యూ శాఖ డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ నివాసంలో కూడా తనిఖీలు చేపట్టారు. వీటితో పాటు మాక్లూర్ మండలం అమ్రాద్ తండాలోని మోహన్ నాయక్ బంధువు రెడ్డి నాయక్ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

Mohan Naik ACB Raid | భారీగా నగదు, బంగారం, ఆస్తుల పత్రాలు స్వాధీనం..
హైదరాబాద్‌లోని మాదాపూర్ నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో లెక్కింపు రాని భారీ ఆస్తులు వెలుగుచూశాయి. మోహన్ నాయక్ ఇళ్ల నుండి రూ. 60 లక్షలకు పైగా నగదు, 13 బంగారు బిస్కెట్లతో పాటు సుమారు ఒక కిలో బరువున్న బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటే హైదరాబాద్, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు ఖాళీ స్థలాలు (ప్లాట్లు), వ్యవసాయ భూములకు సంబంధించిన లెక్కల్లో లేని కీలకమైన ఆస్తుల పత్రాలను అధికారులు గుర్తించారు. ఉదయం నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ సోదాల్లో మరిన్ని కీలక డాక్యుమెంట్లు, బినామీ ఆస్తుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి.
ఆర్&బీ ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ACB సోదాలు
రూ.60 లక్షలకు పైగా నగదు,13 బంగారు బిస్కెట్లు స్వాధీనం
ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ సోదాలు
సుమారు కిలో బంగారు ఆభరణాలు గుర్తింపు
హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో ఆస్తుల పత్రాలు స్వాధీనం
ఖాళీ స్థలాలు,… pic.twitter.com/VZQL0I6H7E
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 9, 2026
ఇది కూడా చదవండి: Anganwadi Salaries | అంగన్వాడీలకు జీతాలు చెల్లించాలి: హరీశ్‌రావు