DGP Anand Comments | ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్.. డీజీపీ ఆనంద్‌ కీలక వ్యాఖ్యలు

డీజీపీ సీవీ ఆనంద్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DGP Anand Comments | తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదన్నారు. ప్రజలను గౌరవిస్తాం.. రౌడీలు, గుండాలను కాదని చెప్పారు.

డీజీపీ ఆనంద్​ బుధవారం ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్​ శాఖ పని చేస్తోందన్నారు. ఆదిలాబాద్​ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాయన్నారు.

DGP Anand Comments | అందుకే ప్రమాదాలు..

cv anand

జాతీయ రహదారి 44 (NH 44)పై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు డీజీపీ తెలిపారు. ఇందుకు అక్రమ పార్కింగ్​లే కారణమని స్పష్టం చేశారు. వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ తమ వాహనాలను ఆపోద్దని సూచించారు. సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. 200 మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్​ జిల్లా పోలీసులు బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు.

DGP Anand Comments | గ్రేహౌండ్స్​ను తీసేస్తున్నాం

తెలంగాణలో మావోయిజం అంతమైందని డీజీపీ ప్రకటించారు. దీంతో గ్రేహౌండ్స్‌ విభాగాన్ని తీసేస్తున్నట్లు తెలిపారు. అందులో పని చేస్తున్న 1700 మందిని కొత్త విభాగాలకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో గ్రేహౌండ్స్​ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

DGP Anand Comments | గంజాయి నివారణకు చర్యలు

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ నివారణకు చర్యలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. గంజాయి ప్రస్తుతం గ్రామాల్లోకి కూడా వచ్చిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్​లా రాష్ట్ర యువత డ్రగ్స్‌కు బానిసలు కావద్దన్నారు. భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో గంజాయి ఎక్కువగా సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. గంజాయి సాగు చేసిన 110 మంది రైతులకు రైతు భరోసా నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.

దీనిని కూడా చదవండి : Helicopter Crash | పీవోకేలో కూలిన పాక్​ ఆర్మీ హెలికాప్టర్​.. 21 మంది మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *