అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Heavy Rains | హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘కోర్ అర్బన్ రీజియన్’ (CURE) పరిధిలోని సంబంధిత శాఖలు, ఏజెన్సీల ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
హైదరాబాద్ శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే శనివారం సైతం నగరంలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైడ్రా (HYDRAA), విద్యుత్ పంపిణీ సంస్థలు, వాటర్ బోర్డు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
Hyderabad Heavy Rains | బృందాలను మోహరించాలి

పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, అలాగే నగరవ్యాప్తంగా అత్యవసర సేవలు, సాధారణ జనజీవనం ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చూడటానికి… తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డీజీపీ (DGP), స్పెషల్ చీఫ్ సెక్రెటరీ (CURE) వంటి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి అత్యవసర ‘వార్-రూమ్’ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెయిన్ ఫోర్ కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా టీమ్స్ మోహరించాలని సూచించారు.
దీనిని కూడా చదవండి : Telangana Land Tax | త్వరలో భూములపై పన్ను : మంత్రి పొంగులేటి