అక్షరటుడే, వెబ్‌డెస్క్: Penthouse Shed Collapse | హైదరాబాద్ (Hyderabad)లో పెంట్‌హౌస్ పైనుంచి రేకుల షెడ్డు కూలి బైకర్‌పై పడటంతో అతను గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం టోలిచౌకిలో గల పారామౌంట్ కాలనీ గేట్ నెం.3 సమీపంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ గాలివాన బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో పారామౌంట్ కాలనీలో గల ఓ పెంట్‌హౌస్ రేకులు వదులుగా అయ్యాయి. ఈ క్రమంలో శనివారం ఒక్కసారిగా రేకులు పై నుంచి కింద రోడ్డు మీద పడ్డాయి. ఆ సమయంలో అటుగా బైక్‌పై వెళ్తున్న ఇద్రిస్‌పై రేకులు పడటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
Penthouse Shed Collapse | ఆస్పత్రికి తరలింపు
ఒక్కసారిగా రేకులు పడటంతో ఇద్రిస్ బైక్‌పై నుంచి కింద పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆందోళన చెందిన స్థానికులు, భవనాలపై ఉండే షెడ్డులు, హోర్డింగ్‌ల భద్రతను నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కాగా రద్దీగా ఉండే రోడ్డులో రేకులు పడగా.. ఒకరికే గాయాలు కావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Biker injured after a Tin Shed falls from penthouse on him in Hyderabad, caught in CCTV.
The incident occurred near Gate No.3 of Paramount Colony in #Tolichowki, #Hyderabad, on Saturday.
A biker passing by was injured when a tin shed on a building’s penthouse suddenly fell on… pic.twitter.com/cCyh21NcNA
— Surya Reddy (@jsuryareddy) June 14, 2026
దీనిని కూడా చదవండి : Hyderabad Reservoir Inflows | హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. జంట జలాశయాలకు వరద ప్రారంభం