Harish Rao Criticism | పిల్లల ముందు రాజకీయాలేనా.. సీఎంపై హరీశ్​రావు విమర్శలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao Criticism | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్​రావు ఫైర్​ అయ్యారు. పిల్లల ముందు కూడా రాజకీయాలేనా అని ప్రశ్నించారు. ఆరుట్ల స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థుల సమక్షంలో రాజకీయ వ్యాఖ్యలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హరీశ్​ రావు తాటిచెట్టు లెక్క పెరిగాడు అంటూ పిల్లల ముందు మాట్లాడటం సరైందేనా అని ఆయన అన్నారు. రైతుబంధు, రైతు భీమా, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నా ఎత్తు గురించి ఆ పిల్లలకు ఎందుకు రేవంత్ రెడ్డి అని నిలదీశారు. తనను ఎన్ని మాటలు అన్నా కూడా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

Harish Rao Criticism | కార్పొరేషన్లకు నిధులు లేవు

సీఎం రేవంత్​రెడ్డి 33 కులాలకు 33 కార్పొరేషన్లు వేశారు కానీ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదని హరీశ్​రావు అన్నారు. కార్పొరేషన్లకు మాత్రం ఛైర్మన్లను పెట్టి వాళ్లకు ఒక కారు, ప్యూన్, ఫ్యాన్ ఇచ్చాడు అంతే తప్ప ఎవరికి ఒక్క రూపాయి కూడా సాయం జరగలేదని విమర్శించారు. అధికారులు తన మాట వినట్లేదని సీఎం అంటున్నారని ఆయన పేర్కొన్నారు. రేవంత్​రెడ్డికి చేతగాక అధికారుల మీద ఏడిస్తే ఎట్ల అని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి..: Kavitha Singareni Comments | తెలంగాణ ఇజ్జత్​ తీస్తున్న సీఎం.. కవిత సంచలన వ్యాఖ్యలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *