అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rythu Bharosa Funds | రాష్ట్ర ప్రభుత్వం (State Government) రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వానాకాలం సాగు సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 30న విడుదల చేయనుంది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో రైతు భరోసాపై చర్చించారు. రైతు భరోసా నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 30న మధిరలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఆ సభలో సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. అనంతరం అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Rythu Bharosa Funds | తప్పనున్న తిప్పలు
ప్రభుత్వం ఈ నెల 26న రైతు భరోసా (Rythu Bharosa) విడుదల చేస్తుందని మొదట ప్రచారం జరిగింది. అయితే తాజాగా మంత్రివర్గం దీనిపై క్లారిటీ ఇచ్చింది. 30న నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును రైతు భరోసాగా మార్చిన విషయం తెలిసిందే. ఎకరాకు రూ.6 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో ఒక్కసారి మాత్రమే పూర్తిస్థాయిలో రైతు భరోసా జమ చేసింది. గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో వేసింది. పోయిన యాసంగి సీజన్లో రెండు ఎకరాల వరకు మాత్రమే డబ్బులు వేసింది. ఈ సీజన్లో సకాలంలో డబ్బులు జమ చేస్తామని చెప్పడంతో రైతులకు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన తిప్పలు తప్పనున్నాయి.
ఇది కూడా చదవండి..: RTC Fitment 2021 | ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు.. ఫిట్‌మెంట్‌పై మంత్రి పొన్నం క్లారిటీ