Jana Sena Telangana | జనసేనలోకి హైదరాబాద్​ మాజీ మేయర్?

హైదరాబాద్​ మాజీ మేయర్​ జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని టాక్​ వినిపిస్తోంది.

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jana Sena Telangana | తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని, ఎన్నికల్లో సైతం పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​  (AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తమకు కార్యకర్తలు ఉన్నారని, వారి కోసం పోటీ చేస్తామన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్​ మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​రావు జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

నెల రోజులుగా తెలంగాణ రాజకీయాలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ గారి చుట్టూనే తిరుగుతున్నాయి. ఆ పార్టీ తెలంగాణలో దూకుడు పెంచి కార్యాలయాన్ని సైతం ప్రారంభించింది. ఈ క్రమంలో పలువురు నేతలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని టాక్​ వినిపిస్తోంది. GHMC మాజీ మేయర్‌గా పనిచేసిన ఓ కీలక నేత జనసేన పార్టీలో చేరుతారని సమాచారం. ఇప్పటికే జనసేన తెలంగాణ ముఖ్య నేతలతో సంప్రదింపులు ప్రారంభమైనట్లు సమాచారం.

Jana Sena Telangana | త్వరలో చేరిక

మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​ జనసేనలో చేరితో హైదరాబాద్​లో ఆ పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా సదరు నేత చేరికపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే చేరిక తేదీ ఖరారయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా బొంతు రామ్మోహన్​ బీఆర్​ఎస్​లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేసిన ఆయన 2002లో బీఆర్​ఎస్​లో చేరారు. ఆ పార్టీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పని చేశారు.

Jana Sena Telangana | కాంగ్రెస్​లో చేరిక

Jana Sena Telangana

బీఆర్​ఎస్​లో కీలక పదవులు అనుభవించిన బొంతు రామ్మోహన్​ 2016 జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో చర్లపల్లి కార్పొరేటర్​గా గెలిచారు. అనంతరం మేయర్​ అయ్యారు. అయితే 2023లో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో ఆయన 2024 ఫిబ్రవరిలో హస్తం గూటికి చేరారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో తాజాగా జనసేనలో చేరుతారని సమాచారం.

ఇది కూడా చదవండి..: Gundla Singaram Eviction | పేదల గుడిసెల తొలగింపు.. హన్మకొండ గుండ్లసింగారంలో ఉద్రిక్తత

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *