అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad ACP Appointments | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో ముగ్గురు ఏసీపీలు నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Nizamabad ACP Appointments | కమిషనరేట్ పరిధిలో..
సీసీఎస్ ఏసీపీగా శ్రీశైలం నియమితులయ్యారు. ఈయన గతంలో జిల్లాలో సీఐగా, వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. అలాగే నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా ఆర్ నరేందర్‌కు పోస్టింగ్ ఇచ్చారు. నిజామాబాద్ సీసీఆర్బీ ఏసీపీగా గురునాయడిని నియమిస్తూ డీజీపీ ఆదేశాలిచ్చారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 36మంది అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో కొందరు అధికారులు కొన్నాళ్లుగా పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Armoor Prohibitory Orders | ఆర్మూర్‌లో ధర్నాలు.. రాస్తారాకోలు నిషేధం: సీపీ సాయిచైతన్య