అక్షరటుడే, ముప్కాల్: Vempalli Lorry Accident | మండలంలోని వేంపల్లి (Vempalli) గ్రామ శివారులోని బైపాస్ వద్ద మంగళవారం లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
Vempalli Lorry Accident | ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు..
స్థానికుల కథనం ప్రకారం.. ఆర్మూర్ (Armoor) నుంచి నిర్మల్ వైపు సంత్రాల లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Kamareddy SP | అంతర్రాష్ట్ర గంజాయి నిందితుల అరెస్టు..